కొవిడ్ విజృంభిస్తోన్న క్లిష్ట పరిస్థితుల్లో.. వైరస్‌పై పోరాటానికి ప్రతిపక్షాలు కలిసి రావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరితో కలిసి బెల్లంపల్లి కొవిడ్ ఆసుపత్రిని సందర్శించారు. హాస్పిటల్ ఆవరణలో సింగరేణి ఆధ్వర్యంలో రూ. 35 లక్షలతో ఏర్పాటవుతోన్న ఆక్సిజన్ ప్లాంటును ఆయన పరిశీలించారు.
అనంతరం వార్డుల్లో తిరుగుతూ కరోనా రోగులతో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో పాటు రోగులకు బలవర్ధకమైన భోజనం అందుతోందని వివరించారు. ప్రజలంతా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్వేత, వైస్ ఛైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ములుగు సమీపంలో సెంట్రల్ నర్సరీ ఏర్పాటుకు ఎఫ్డీసీ ప్రతిపాదన