ETV Bharat / state

కొడుకు మరణాన్ని తట్టుకోలేక... తల్లి గుండె ఆగిపోయింది..

అమ్మా... నేను ఈతకు వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కొడుకు విగతజీవిగా వస్తాడని ఆమె ఊహించలేదు. ఉలుకూపలుకు లేకుండా పడి ఉన్న కొడుకును చూసి... ఆమె ఎంతగానో రోదించింది. గుండెలవిసేలా ఏడ్చి... కొడుకు చెంతకే చేరిపోయింది. ఈ హృదయవిదార ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.

mother-and-son-death-tragedy-happend-in-mancheriyala
కొడుకు మరణాన్ని తట్టుకోలేక... ఆగిపోయిన తల్లి గుండె
author img

By

Published : May 17, 2020, 11:57 AM IST

Updated : May 17, 2020, 4:37 PM IST

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మాడవెల్లి గ్రామానికి చెందిన రాదండి సంపత్, కుంచె రామ్ చరణ్​లు స్నేహితులు. సరదగా ఈతకు వెళ్దామని అనుకున్నారు. అమ్మ ఈతకు వెళ్తున్నా అని చెప్పి ఇళ్ల నుంచి బయలుదేరారు. కొంతసేపటికి స్నేహితులు ఇద్దరు చనిపోగా వారిని ఇళ్లకు తీసుకొచ్చారు.

విగత జీవిగా పడి ఉన్న సంపత్ మృతదేహాన్ని చూసి తల్లి రాజేశ్వరి తట్టుకోలేకపోయింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. బెల్లంపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగానే ప్రాణం విడిచింది. ఒకే రోజు కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో భర్త, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చూడండి: రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి

Last Updated : May 17, 2020, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.