మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి సంబురంగా ఆడిపాడారు. రాష్ట్రంలోని మహిళలంతా బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్షి, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సింగరేణికి ఒడిశాలో "న్యూ పాత్రపాద" కేటాయింపు