ETV Bharat / state

అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంది: బాల్క సుమన్ - తెలంగాణ వార్తలు

కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సేవలపై చర్చించినట్లు తెలిపారు. సుమారు 18 ప్రైవేటు ఆస్పత్రులను కొవిడ్ వైద్యం కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు.

mla balka suman review on corona cases, mla balka suman review
కరోనా పరిస్థితులపై బాల్క సుమన్ సమీక్ష, మంచిర్యాలలో కొవిడ్ పై సమీక్ష
author img

By

Published : May 11, 2021, 5:04 PM IST

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బాధితులు అధైర్యపడొద్దని అన్నారు. మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలు మహారాష్ట్రకు దగ్గర్లో ఉండడం వల్ల కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మంచిర్యాలలో సోమవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సేవలపై చర్చించినట్టు తెలిపారు. ఈ రెండు జిల్లాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. కరోనా బాధితులకు ఇచ్చే కిట్లు, పరీక్ష పరికరాల కొరత ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయాలను కేసీఆర్​కు దృష్టికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. రాష్ట్ర వైద్య సేవల, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి వివరించామని తెలిపారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 450 ఐసోలేషన్ పడకలు ఉన్నాయని వెల్లడించారు.

జిల్లాలో సుమారు 18 ప్రైవేటు ఆస్పత్రులను కొవిడ్ వైద్యం కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. అందరూ విధిగా ధరించి... భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందుకు గురికావొద్దన్నారు. లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సన్నద్ధత లేకుండా.. పడకల పెంపు.. ప్రమాదం రెట్టింపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.