Harish Rao attend public meeting in Manchiryala: రాష్ట్రానికి రావాల్సిన రూ.30కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కోన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. పొలాల్లోని బోరు మోటార్లకు మీటర్లు అమర్చలేదని కేంద్రం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలుపుదల చేసిందని మంత్రి ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్లమెంటులో మెచ్చుకుంటూ.. ఇక్కడికి వచ్చి బీజేపీ నాయకులు గల్లీలో తిడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో ఉందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల పిల్లలకు వైద్యవిద్య కోర్సుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ప్రకటించామని.. అవి వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
"బొగ్గు బావులు అమ్మి సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఆ బొగ్గు బావులే కనుక సింగరేణికి వస్తే మరికొంత మందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు. సింగరేణి లాభాలు పెరిగితే కార్మికుల బోనస్ పెరుగుతుంది. సింగరేణికి గనులు ఇవ్వకుండా నష్టాలు వస్తే అమ్మకానికి పెట్టేయాలని కేంద్రం చూస్తుంది. ఈరోజు సింగరేణిని కాపాడుకోవాలంటే బీజేపీకో హఠావో.. సింగరేణికో బచావో అనే నినాదంతో ముందుకు వెళ్లాలి. సింగరేణి రాష్ట్ర మెడికల్ కళాశాలలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్‌ను ప్రకటిస్తున్నాము. అమ్ముడు, ఊడగొట్టుడు బీజేపీ పని అయితే.. ఉద్యోగాలు ఇవ్వడం బీఆర్ఎస్ పని." - హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి
ఇవీ చదవండి: