ETV Bharat / state

ఖరీఫ్‌ కనీస మద్దతు ధరల పెంపు- పత్తి రైతులకు నిరాశే - undefined

కేంద్ర ప్రభుత్వం 2019-20 ఖరీఫ్‌ సీజన్‌కు ఖరీఫ్‌ మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వరి రైతులకు కాస్త ఊరట కలిగించినా పత్తి రైతులకు మాత్రం నిరాశే మిగిల్చిందని చెప్పవచ్చు. రైతుల పెట్టుబడి ఖర్చు వేలల్లో పెరుగుతుంటే ప్రభుత్వ మద్దతు ధర వందల్లోనే  ఉంటోంది.

ఖరీఫ్‌ కనీస మద్దతు ధరల పెంపు- పత్తి రైతులకు నిరాశే
author img

By

Published : Jul 5, 2019, 9:56 AM IST

అన్నదాతకు కొంత ఊరట.. రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక నష్టపోతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 2019-20 ఖరీఫ్‌ సీజన్‌కు ఖరీఫ్‌ మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి ఖర్చుకు అనుగుణంగా ప్రభుత్వం మద్దతు ధరలను పెంచినట్లు వెల్లడించింది. ఏటా పెట్టుబడి మాత్రం వేలల్లో పెరుగుతూ పోతుంటే ప్రభుత్వం పెంచే మద్దతు ధర మాత్రం వందలోపే ఉండటం రైతులకు పూర్తి ప్రయోజనం కలిగించకపోయినా పర్వాలేదనిపించింది. పెరిగిన వరి ధర కాస్తా ఊరట కల్గించినా పత్తి రైతులకు మాత్రం నిరాశే మిగిలింది. పెరిగిన మద్దతు ధర ఈ ఖరీఫ్‌ నుంచి అమలు కానుంది.

మొక్కజొన్నకు రూ.60పెంపు
మొక్కజొన్నకు రూ.60 మాత్రమే పెరగింది. మొక్కజొన్నకు మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాలు లేక వ్యాపారులు చెప్పిన ధరలకే అమ్ముకోవాల్సి వస్తోంది. వీటికి చీడలు ఎక్కువగా ఆశించడం....ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. దీంతో దళారులు క్వింటాలుకు రూ. 1600 నుంచి రూ.1700 వరకు కొనుగోలు చేస్తున్నారు. ధర పెంచడమే కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

పత్తి రైతుకు నిరాశే
జిల్లాలో ఎక్కువగా పండిస్తున్న పంట పత్తి. మిగతా పంటలతో పోలిస్తే పెట్టుబడి ఎక్కువ. పంటకు చీడల బెడద ఎక్కువే.. అయినప్పటికీ క్వింటాలుకు కేవలం రూ.105 మాత్రమే పెంచడం రైతులకు నిరాశే మిగిల్చింది. విత్తనాల కొనుగోలు నుంచి మొదలు పత్తి తీసేవరకు

వరి రైతుకు మేలు
వరి ధాన్యానికి మద్దతు ప్రకటించడంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వరికి ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా క్వింటాలుకు రూ.65 పెరగడంతో గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో పత్తి తర్వాత అత్యధికంగా సాగువుతున్న పంట వరి. ఈ పంటకు ఏటా దోమ పోటు, ఇతర చీడల బారిన పడి రైతులు నష్టపోతున్నారు. ఈ సమయంలో మద్దతు పెంచడం కొంతలో కొంత లాభం జరిగే అవకాశం ఉంది.

జిల్లాలో వరి సాగు లక్ష ఎకరాలు
రూ.40వేల వరకు పెట్టుబడి అవుతోంది. పత్తి పూర్తిగా వాతావరణ ఆధారితం కావడం... వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల మేర చేతికి వస్తుంది. బాగా పండితే రూ.40వేల వరకు ఆదాయం వస్తుంది. అంటే మద్దతు ధర ప్రకారం వచ్చే ఆదాయం పెట్టుబడికే సరిపోతోంది. ఇది కూడా పూర్తిగా వాతావరణం అనుకూలించినపుడు మాత్రమే. విత్తడం, దున్నడం, కలుపు తీయడం, పత్తి తీయడం కోసం కూలీ ఖర్చులు పెరుగుతుండటంతో దీనికి అనుగుణంగా మద్దతు ధర పెరగక పోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది.

పప్పు ధాన్యాలకు ఫర్వాలేదు..
గతేడాదితో పోలిస్తే ఈసారి పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచడం రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కంది క్వింటాలుకు రూ.125, పెసరకు రూ.75, మినుములకు రూ.100 పెంచడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మద్దతు ధర పెంచడం వల్ల పప్పు దినుసులు పండించే రైతులకు గిట్టుబాటు పెరిగే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి: నేటి నుంచి కొత్త జడ్పీల పాలన

sample description

For All Latest Updates

TAGGED:

mncl
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.