మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశాకు చెందిన వలస కార్మికులను పోలీసులు స్వస్థలాలకు పంపారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు 11 బస్సులు ఏర్పాటు చేసి ఇటుక బట్టీల్లో పని చేస్తున్న వలస కార్మికులను వారి ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు కలిసి ఒడిశా కూలీలను సొంతూళ్లకు పంపారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు