ETV Bharat / state

నిండిన ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తిన అధికారులు!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని జలాశయాలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్ని నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు పూర్తిస్థాయికి చేరగా.. అధికారులు 8గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు వరద నీటిని వదిలారు.

Manhirial District Collector Inspects Ellampalli Project
నిండిన ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తిన అధికారులు!
author img

By

Published : Aug 20, 2020, 6:16 PM IST

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాజెక్టులు, వాగులు పూర్తిగా నిండాయి. జిల్లాలో ప్రవహించే గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. జలాశయం పూర్తిగా నిండడం వల్ల అధికారులు 8 గేట్లు ఎత్తి 82,808 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ప్రాజెక్టు వద్దకు చేరుకొని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ హెచ్చరించారు. వర్షాల ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్​లో హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసినట్టు.. సహాయం కావాల్సిన వారు 08736 250251 ఫోన్​ చేయాలని జిల్లా కలెక్టర్​ తెలిపారు.

ఇవీ చూడండి: 'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.