పాలసీదారులకు చెల్లించే మెచ్యూరిటీలో బోనస్లు పెంచాలని మంచిర్యాల జిల్లా ఎల్ఐసీ ఏజెంట్లు ధర్నా చేపట్టారు. ఐపీఓను రద్దు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ధర్నా చేయాలన్న జీవిత బీమా సమైక్య పిలుపు మేరకు విధులు బహిష్కరించామని జిల్లా అధ్యక్షుడు తిరుపతి యాదవ్ తెలిపారు.
1956లో రూపొందించిన బీమా చట్టాలలో సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా మార్చాలని కోరారు. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం ఏజెంట్లకు గ్రాట్యుటీ పెంచాలన్నారు.
ఇదీ చదవండి: ఎడ్లబండిపై దర్జాగా శునకం సవారీ..