మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దాగం సురేందర్ పాత ఇంటికి ప్లాస్టింగ్ చేయిస్తున్న సమయంలో పక్కింట్లో ఉంటున్న దుర్గయ్య ప్లాస్టింగ్ తన భూమిలోకి వచ్చి చేయవద్దని చెప్పాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర కోపానికి గురైన సురేందర్ బండరాయితో దుర్గయ్య తలపై బలంగా కొట్టాడు. దీనితో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు