ETV Bharat / state

'జూడాలుపై దాడికి నిరసనగా మంచిర్యాలలో ధర్నా' - KOLKATA MEDICAL COLLEGE

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూడాలుపై జరిగిన దాడికి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. వైద్యులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

వైద్యులకు తగిన రక్షణ కల్పించాలి
author img

By

Published : Jun 17, 2019, 8:24 PM IST

కోల్​కతా మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యులపై దాడికి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. వైద్యులపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలు చేసినప్పటికీ ఆచరణలో లోపం ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న రోగిని ఏ వైద్యుడైనా బతికించేందుకే కృషి చేస్తారని, కొంతమంది విచక్షణారహితంగా డాక్టర్లపై దాడులకు దిగడం అమానుషమన్నారు.
డాక్టర్లపై జరుగుతున్న దాడుల గురించి ఆలోచిస్తే భవిష్యత్​లో వైద్య వృత్తి చేపట్టడానికి వెనకడుగు వేస్తారని మంచిర్యాల జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

వైద్యులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : ఐఎంఓ

ఇవీ చూడండి : వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులు

Intro:TG_ADB_11_17_DOCTORS NIRASANA_AV_C6

Body:
కోల్ కత్తా మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యుల పై దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రవేట్ ఆసుపత్రులలో వైద్యులు లు సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు.
ప్రభుత్వాలు వైద్యులపై జరుగుతున్న దాడులు వేధింపుల అరికట్టడానికి ప్రత్యేక చట్టాలు అమలు చేసినప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదని అని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆపదలో ఉన్న రోగిని ఏ వైద్యుడైన నా ప్రాణాలను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారని, ఇది తెలియని కొంతమంది డాక్టర్ల పై దాడులకు దిగడం అమానుషమని అన్నారు. డాక్టర్ల పై జరుగుతున్న దాడులను ఆలోచిస్తే భవిష్యత్తులో వైద్య విద్య చేయడానికి వెనక అడుగు వేస్తున్నారని మంచిర్యాల జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ తెలిపారు.
అనంతరం వైద్యులకు రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్ల పై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్యులు ర్యాలీ నిర్వహించారు.

byte: డాక్టర్ రమణ , ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిర్యాల.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.