మంచిర్యాల జిల్లా మందమర్రిలో కలీం అనే యువకుడు తన జన్మదిన వేడుకలను వినూత్నంగా జరుపుకున్నాడు. ఆర్భాటాలకు పోకుండా 60 రకాల పూల, పండ్ల మొక్కలు నాటాడు. సింగరేణి నర్సరీ నుంచి తీసుకువచ్చి వాటిని తన చిన్ననాటి స్నేహితుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జన్మదినం రోజున మొక్కలను పంపిణీ చేస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలని సంకల్పించినట్లు కలీం తెలిపారు.
ఇవీ చూడండి: బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'