ETV Bharat / state

చెంతనే గోదావరి ఉన్నా... తాగు నీరేదీ ?

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు విఫలమయ్యారని భాజపా నాయకుడు రఘునాథ్ రావు విమర్శించారు. పట్టణ ప్రజలకు శుద్ధ జలం అందించాలని పురపాలకులను కోరారు.

ఎమ్మెల్యే కూడా ఈ నీరే తాగుతున్నారా ? : రఘునాథ్ రావు
author img

By

Published : Jun 10, 2019, 11:24 PM IST

మంచిర్యాల పట్టణంలో తాగునీటికి బదులు మురికి నీటిని అందిస్తున్నారని మున్సిపాలిటీ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రజలకు తాగునీరు అందించడంలో పురపాలక సిబ్బంది, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భాజపా నాయకుడు రఘునాథ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన మంచిర్యాల మున్సిపాలిటీకి అనేక సమస్యలు ఉన్నాయని, డంపింగ్ యార్డు లేక చెత్త సేకరణ చేయట్లేదని అన్నారు. పుర నిధులను నాయకులు, అధికారులు వృథా చేయకుండా ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ఉపయోగించాలని సూచించారు.

తాగునీటి సరఫరాలో ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం : రఘునాథ్ రావు

ఇవీ చూడండి : కూలికి పోకుంటేనే బిందె నిండుతది

Intro:TG_ADB_11_10_BJP DARNA _AV_C6

Body:మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు త్రాగునీరు కు బదులు మురికి నీటిని అందిస్తున్నారని మురికి నీటి బాటిళ్లతో మున్సిపాలిటీ కార్యాలయం ముందు భాజపా శ్రేణులు ఆందోళన చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆనుకొని గోదావరి నది ఉన్న ప్రజల కనీస అవసరమైన త్రాగునీరు అందించడం లో మున్సిపాలిటీ సిబ్బంది , ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బిజెపి నాయకుడు రఘునాథ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమయ్యారని బిజెపి నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నగరాలలో ఒకటయిన మంచిర్యాలకు మున్సిపాలిటీ నుంచి అనేక సమస్యలు ఉన్నాయని డంపింగ్ యాడ్ లేక చెత్త సేకరణ చేయడం లేదని అన్నారు. పట్టణ ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా పారవేయడం తో మంచిర్యాల చెత్త నగరంగా తయారైందని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం . మున్సిపాలిటీ నిధులను నాయకులు అధికారులు వృధాగా కాకుండా ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి సద్వినియోగ పరచాలని కోరారు....

బైట్ : రఘునాథ్ రావు, బిజెపి నాయకుడు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.