ETV Bharat / state

పాత కక్షలతో వ్యక్తిపై యువకుల హత్యాయత్నం - four tried to kill one in mancherial district

మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్యకు యత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం గాంధీనగర్​లో చోటుచేసుకుంది.

four boys tried to kill a person in mancherial district with old grudge
పాత కక్షలతో వ్యక్తిపై యువకుల హత్యాయత్నం
author img

By

Published : May 16, 2020, 11:34 AM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియా గాంధీ నగర్​లో శుక్రవారం అర్ధ రాత్రి మద్యం మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. పాత కక్షలతో శ్రీనివాస్ అనే వ్యక్తిని యువకులు కత్తితో పొడిచారు.

గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారమందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుణ్ని ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు యువకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.