మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేటలో పంచాయతీ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. వీఆర్వో లక్ష్మణ్ భూ సమస్యల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. వారసత్వంగా వచ్చిన భూమిని కాసులకు కక్కుర్తి పడి అసలు పట్టాదారు పేరును తొలగించి తనకు ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడ్డ గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం