నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నాలుగు ముఠాలను మంచిర్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆమోదిత కవర్లలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి సుమారు 41 లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
14 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం
తాండూరు నీల్వాయి, మాదారం, రామకృష్ణాపూర్ ప్రాంతాలలో సమాచారాన్నిసేకరించి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 14 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గడ్డి మందు ఉపయోగించడం వల్ల మూడు నాలుగేళ్లలో భూమి సారం తగ్గి విషతుల్యంగా మారుతుందని రెండవ పంట నుంచి దిగుబడి పూర్తిగా తగ్గుముఖం పట్టి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య వెల్లడించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో నకిలీ విత్తనాలు అక్రమ రవాణా చేసే వారి జాబితాను సిద్ధం చేశామని త్వరలో చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని సీపీ సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి: మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ