ETV Bharat / state

Dancer Ravi kumar: రవి ఆటకు నృత్యమే మైమరచిపోయింది.. 10 వేల మందికి...

భారతీయ సంప్రదాయాల్లో భాగమైన భరత నాట్యం, కూచిపూడి నృత్య కళలకు క్రమంగా ఆదరణ తగ్గుతున్న వేళ.. ఇప్పటికీ ఈ శాస్త్రీయ, ప్రాచీన కళలకు కొందరు ప్రాణం పోస్తూనే ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే యువ కళకారుడు డా.రవికుమార్. పాశ్చాత్య నృత్యాల నుంచి శాస్త్రీయ కళలవైపు మళ్లి ఉత్తమ ప్రదర్శనతో పలు అవార్డులు పొందిన రవి కుమార్.. నృత్య గురువుగా కొనసాగుతున్నారు. పది వేల మందికి పైగా నృత్యాల్లో శిక్షణ ఇచ్చి శాస్త్రీయ నృత్యాలకు జీవం పోస్తున్నాడు. కూచిపూడి, భరతనాట్య కళలను ప్రపంచ దేశాలకు చాటాలని కంకణం కట్టుకున్నాడు. కనుమరుగుతున్న కళలను ప్రాచుర్యంలోకి తెస్తున్న డా.రవికుమార్​పై​ ప్రత్యేక కథనం.

Dancer Ravi kumar
Dancer Ravi kumar
author img

By

Published : Dec 2, 2021, 5:54 PM IST

Dancer Ravi kumar: కనుమరుగవుతున్న కళలకు ప్రాణం పోస్తూ.. 10 వేల మందికి శిక్షణ

మంచిర్యాల నస్పూర్​కాలనీ చెందిన నామని రవికుమార్ ఎంకామ్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి వెస్టర్న్ డ్యాన్స్​పై అసక్తి ఉండేది. పదో తరగతి చదువుతున్న సమయంలో జక్క కృష్ణ అనే గురువు అతనికి కూచిపూడి నేర్చుకోమని సలహా ఇచ్చారు. కానీ వెస్టర్న్ మీద ఉన్న మక్కువతో పెడచెవిన పెట్టారు. సంవత్సరం తర్వాత రవిని కలిసిన జక్క కృష్ణ.. అతను చేస్తున్న నృత్యం చూసి కూచిపూడిలో మంచి స్థాయికి వెళతావని సూచించడంతో కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించారు..రవి. అలా నేర్చుకుంటుండగానే రవికి కూచిపూడిపై అమితమైన ఇష్టం పెరిగింది. ఫలితంగా కూచిపూడితో పాటు భరత నాట్యం కూడా అభ్యసించారు. అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడి సర్టిఫికేషన్​ కోర్సు చేశారు. నృత్యంతో పాటు చదువుపైనా దృష్టిసారించి.. ఎంకామ్ పూర్తి చేశారు. గ్రామంలో ఉంటే.. తన కళ పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం తక్కువని.. 2012లో రవి హైదరాబాద్​కి వచ్చారు. తొలుత కొన్ని పాఠశాలల్లో నృత్యాచార్యునిగా పనిచేశారు. 2018లో బెంగళూరులోని ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీలో కూచిపూడి విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. అదే యూనివర్సిటీ అతనికి డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.

10 వేల మందికి శిక్షణ..

హైదరాబాద్ నగరానికి వచ్చిన రవికుమార్ కనీస అవసరాలకోసం పాఠశాలల్లో డ్యాాన్స్ మాస్టర్​గా పనిచేశారు. అలా పనిచేస్తూనే పలు చోట్ల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం నృత్య శిక్షణ పాఠశాలను నెలకొల్పి సుమారు 10వేల మంది యువతీ,యువకులను కూచిపూడి, భరతనాట్యం, వెస్టర్న్ డ్యాన్స్​లో శిక్షణ ఇచ్చారు. కేవలం నామమాత్రపు ఫీజును మాత్రమే తీసుకుంటూ శిక్షణ అందిస్తున్నారు.

ఎన్నో అవార్డులు..

ఇతని వద్ద శిక్షణ పొందిన వారిలో కొంత మంది నృత్య గురువులయ్యారు. శాస్త్రీయ నృత్యాలైన కూచిపూడి, భరత నాట్యంతో పాటు పాశ్చాత్య నృత్యాలు, ఫిట్​నెస్​ కోసం చేసే జుంబా సైతం నేర్పిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంసలు పొందారు. ఇందుకు రవికి నాట్య శిరోమణి, నాట్య ప్రవీణ్, కళారత్న బిరుదులు దక్కాయి. 2014లో ఏపీజే అబ్దుల్​కలాం అవార్డు, 2017లో మదర్​థెరిసా అవార్డు, 2019లో గురుబ్రహ్మ, 2020లో ఐకాన్ ఆఫ్​ ది ఇయర్​ అవార్డులను సొంతం చేసుకున్నారు. 2019 జనవరిలో 474 కళాకారులతో తెలంగాణ జానపద నృత్య ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. వీటితో పాటు ఎన్నో స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు పొందారు.

ఒత్తిడి నుంచి ఉపసమనం...

కూచిపూడి, భరత నాట్యం నేర్చుకుంటే ఎన్నో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని రవికుమార్ చెబుతున్నారు. శిక్షణలో భాగంగా నాభి భాగం నుంచి ఉచ్చరించే శ్లోకాలతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందంటున్నారు. నృత్య గురువు రవికుమార్​ వద్ద శిక్షణ తీసుకుంటున్న యువతీయువకులు శాస్త్రీయ నృత్యాలపై మంచి పట్టు సాధిస్తున్నారు. లయబద్దంగా నృత్య భంగిమలతో అదరగొడుతున్నారు.

శిక్షణ ఇచ్చే స్థాయికి వచ్చాం..

గతంలో కంటే తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అలవోకగా ప్రదర్శనలు ఇస్తున్నమని శిక్షణ పొందుతున్న యువతీయువకులు చెబుతున్నారు. నృత్యంలో దొర్లే పొరపాట్లను గుర్తించి.. గురువు ఓపికగా నేర్పిస్తారని చెబుతున్నారు. వెస్టర్న్ డ్యన్స్​ నేర్చుకునే తమకు కూచిపూడి నృత్యం చాలా ఆనందాన్ని, రిలీఫ్​ను ఇస్తుందంటున్నారు. ఇప్పుడు ఎలాంటి బెరుకూ లేకుండా ప్రదర్శనలు ఇస్తున్నామంటున్నారు. రవికుమార్​.. వద్ద నృత్యాలు నేర్చుకొని.. ఇప్పుడు తాము శిక్షణ ఇచ్చే స్థాయికి వచ్చామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల ఆనందం..

రవికుమార్​.. వద్ద భరత నాట్యం, కూచిపూడి నృత్యాలు నేర్చుకున్న తమ పిల్లలు మంచి పట్టు సాధించారని వారి నడవడికలోనూ చాలా మార్పు గమనించామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాలంలోనే తమ పిల్లలు కూచిపూడి, నృత్యంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

'200 మందితో అన్నమాచార్య కీర్తనలు.. అదే నా కల'

శాస్త్రీయ నృత్యాలతో పాటు ఫిట్​నెస్​ కోసం చేసే జుంబాలోనూ తనదైన శైలిలో రవికుమార్ శిక్షణ ఇస్తున్నారు. గతేడాది 75 మందితో 75 నిమిషాల పాటు నిర్విరామంగా జుంబా నృత్యం చేసి రికార్డు నెలకొల్పారు. శాస్త్రీయ నృత్యంలో పీకాక్ డాన్స్ చేసి పలువురి ప్రశంసలు పొందారు. 200 మంది కళాకారులతో అన్నమాచార్య కీర్తనలకు 5 కిలోమీటర్ల భరతనాట్యం, కూచిపూడి నృత్యాల చేసి రికార్డు నెలకొల్పాలనేది తన లక్ష్యమని రవికుమార్ చెబుతున్నారు. అంతర్జాతీయస్థాయిలో భారతీయ నృత్యకళలకు ప్రాచుర్యం తీసుకురావడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వారాంతాల్లో పలు అనాధాశ్రమాల్లోని యువతీయువకులకు రవికుమార్ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. ఉత్సాహం ఉన్న వారు సంప్రదిస్తే శిక్షణ ఇస్తానని చెబుతున్నారు.

ఇదీచూడండి: 'ఆచార్య'లో ఫుల్​ సాంగ్​కు చిరు-చరణ్​ డ్యాన్స్​.. ఫ్యాన్స్​కు పండగే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.