ETV Bharat / state

పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు - తెలంగాణ కరోనా వార్తలు

సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న పాఠశాలల్లో కరోనా అలజడి రేపుతోంది. మంచిర్యాల జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

పాఠశాలలో పెరుగుతున్న కరోనా కేసులు
పాఠశాలలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Feb 28, 2021, 5:16 AM IST

మంచిర్యాల జిల్లా విద్యాశాఖకు కరోనా భయం పట్టుకుంది. జిల్లా కేంద్రంలోని గర్శిల్ల ఉన్నత పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు... హాజీపూర్ మండలంలోని ముల్కల్ల ఉన్నత పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయునికి కొవిడ్​ పాజిటివ్​ రావడం కలకలం రేపుతోంది.

కొవిడ్​ బారిన పడిన ఉపాధ్యాయులు పరీక్షలు చేయించుకునే మూడు రోజుల ముందు వరకు పాఠశాలలకు వచ్చేవారని... విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో కలిసే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు మిగితా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించలేదు. బడిలో కొవిడ్​ కేసులు పెరుగుతున్నా జిల్లా యంత్రంగా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇదీ చూడండి: తెలంగాణలో సామాజిక చైతన్యం కోసం కృషిచేస్తా: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.