ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో కరోనా కలవరం... ఆరుగురికి పాజిటివ్​ - కొవిడ్​-19 వార్తలు

మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా మహారాష్ట్ర నుంచి స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికులేనని తెలిపారు.

corona update in manchirial district
మంచిర్యాల జిల్లాలో కరోనా కలవరం... ఆరుగురికి పాజిటివ్​
author img

By

Published : May 30, 2020, 10:36 PM IST

మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుపోతున్నాయి. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో శనివారం రోజున మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 30కి చేరింది. వీరంతా ఈ నెల 12 న మహారాష్ట్ర నుంచి తమ సొంత ఊళ్లకు వచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు.

జన్నారం మండలానికి చెందిన తపాలపూర్ గ్రామానికి చెందిన నలుగురు, రోటిగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, చింతలపల్లికి చెందిన మరొకరికి వైరస్ సోకినట్లు తేలింది. వీరిని బెల్లంపల్లి ఐసోలేషన్​ వార్డు నుంచి హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు జన్నారం మండలంలోనే 17 మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: 'వ్యక్తిగత పరిశుభ్రతే వైరస్​ నివారణకు మందు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.