Singareni Area Hospital: మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధి రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కొవిడ్ విజృంభిస్తోంది. ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురు వైద్యులు, మరో 15 మంది వైద్య సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురు వైద్య సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఇటీవల సింగరేణి ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతుండటం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది.
ఇదీ చదవండి: