మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిమెంట్ కర్మాగారం ప్రధాన ద్వారం ఎదుట భాజపా ఆధ్వర్యంలో కార్మికులు, భాజపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిమెంటు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను నష్టాల పేరుతో తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాజపా ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.
సిమెంట్ పరిశ్రమను తీసివేసి భూములను రియల్ ఎస్టేట్ రంగంగా మార్చాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని భాజపా పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆరోపించారు. కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేయాలని చూస్తే వారికి భాజపా మద్దతు ఎప్పుడూ ఉంటుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: డీజీపీ కార్యాలయం ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా