కరోనా వంటి ఆపత్కాలంలోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేశారని భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలంతా ఎల్లవేళలా రుణపడి ఉండాలని అన్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి భాజపా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని భరోసానిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.
- ఇదీ చూడండి: 'ముందు నియంత్రించాల్సింది డిజిటల్ మీడియానే'