ETV Bharat / state

పెద్దపల్లి ఎంపీ కనిపించడం లేదంటూ భాజపా ఫిర్యాదు

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కనిపించడం లేదంటూ భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.

BJP leaders compliant against peddapalli MP
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కనిపించడం లేదంటూ భాజపా నాయకుల ఫిర్యాదు
author img

By

Published : Apr 9, 2021, 5:12 PM IST

పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత కనిపించడం లేదని మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తూ ఎంపీ ఎక్కడైనా కనిపించారా అంటూ ప్రజలను ఆరా తీశారు. పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి పీఎస్ వరకు వెళ్లి ఎంపీ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే గేట్ వద్ద రాకపోకలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోకుండా ఎక్కడికి పోయారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు ప్రశ్నించారు. సమస్యలను గాలికొదిలేసి తమ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. ఆబ్కారీ శాఖలో అసిస్టెంట్ కమిషనర్​గా చేసిన అక్రమాలను కప్పి పుచ్చుకోవడం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఆంజనేయులు విమర్శించారు.

ఇదీ చూడండి: పుష్కరఘాట్​ వద్ద రక్షణ చర్యలు చేపట్టిన సర్పంచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.