మంచిర్యాల జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయలాని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ధర్మ పోరాట దీక్ష చేపట్టారు భాజపా నాయకులు. అన్ని వనరులు ఉన్న జిల్లాగా మంచిర్యాలకు పేరున్నప్పటికీ... ప్రభుత్వం మొండిగా వ్యవహరించి వైద్య కళాశాలను రామగుండంకు తరలించే చర్యలు చేపట్టిందని ఆరోపించారు. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే... గిరిజన జిల్లాగా పేరున్న కుమరం భీం అసిఫాబాద్ జిల్లా ప్రజలకు, మంచిర్యాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని మంచిర్యాల జిల్లాలోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆరుబయట మలవిసర్జన చేశారని చిన్నారుల్ని కొట్టి చంపారు!