మంచిర్యాల జిల్లా భీమిని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ దిలీప్ కుమార్.. స్వయం సహాయక సభ్యురాలు సుగుణ, ఐకెపీ సీఏ ధర్మయ్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సుగుణను బ్యాంకు నుంచి బయటకు నెట్టి వేశాడు. ఆగ్రహానికి గురైన మహిళా సంఘం సభ్యులు బ్యాంకు గేట్లు మూసివేసి ధర్నా చేపట్టారు. మేనేజర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
రుణం ఇస్తామని చెప్పి బ్యాంకుకు రమ్మని మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని సుగుణ తెలిపింది. బ్యాంకులో తన ఇష్టం ప్రకారమే రుణం ఇస్తానని దిలీప్ కుమార్ చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రుణం కోసం అడిగితే బ్యాంకు నుంచి నెట్టి వేశారని వాపోయింది.
"రుణం ఇస్తామని చెప్తేనే మేం వచ్చాం. ఇప్పుడేమో నేను ఇవ్వను.. నా బ్యాంకు నా ఇష్టం అని అంటున్నాడు. అదేంటీ సార్ మీ రమ్మంటేనే వచ్చాం కదా అని అడిగితే.. మెడలు పట్టుకొని బయటకు నెట్టేశాడు. మీరు తేది చెప్పరూ.. చెప్పిన తేది రోజు వస్తే ఇవ్వట్లేదు అని అంటే మీదబడి కొట్టిండు. ఇప్పటికీ 15 రోజులు అవుతుంది బ్యాంకు చుట్టు తిరగబట్టి."
-సుగుణ, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు