ETV Bharat / state

గిరిజనుల పోడు భూముల పట్టాలకై ముఖ్యమంత్రికి భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

Bhatti wrote an open letter to the CM Kcr: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Bhattivikramarka wrote an open letter to the CM Kcr for podu lands patta
గిరిజనుల పోడు భూముల పట్టాలకై ముఖ్యమంత్రికి భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
author img

By

Published : Apr 3, 2023, 3:00 PM IST

Bhatti Vikramarka wrote an open letter to the CM Kcr: సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సీఎంకు లేఖ రాశారు. గ్రామాల వారీగా పోడు రైతుల జాబితాను విడుదల చేయాలని, పోడు భూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులపై కేసులు ఎత్తివేయాలని భట్టి కోరారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని... గిరిజనులను ఆదుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు భట్టి బహిరంగ లేఖ రాశారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో భట్టి రెండో రోజు పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈరోజు భీమారం మండలం పోలంప‌ల్లి గ్రామంలో సోమ‌వారం పాద‌యాత్ర‌లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాల భూములను బీఆర్​ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా హక్కులు కోల్పోయారని విమర్శించారు. వారు భూముల్లోకి రాకుండా అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మ‌డి జిల్లాలైన ఆదిలాబాద్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, న‌ల్గొండ తదిత‌ర జిల్లాల్లో పోడు చేసుకుంటున్న రైతుల‌కు త‌క్ష‌ణ‌మే ప‌ట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

నాటి మెనిఫెస్టోలో సైతం: నాటీ టీఆర్ఎస్ 2018 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో సైతం పోడు భూముల అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన స‌మావేశాల్లో 11.50 ల‌క్ష‌ల ఎక‌రా‌ల పోడు భూముల‌కు ప‌ట్టాలిస్తామ‌ని కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు మంత్రివ‌ర్గ స‌మావేశాల్లో ప్రకటించారని తెలిపారు. నాలుగు ల‌క్ష‌ల‌మంది గిరిజ‌న‌ుల హ‌క్కు ప‌త్రాల కోసం ఎదురుచూస్తుంటే 1.5 ల‌క్ష‌మందికే ప‌ట్టాలిస్తామ‌న‌డం.. గిరిజ‌నుల‌ను నిట్టనిలువునా మోసం చేయ‌డ‌మే అవుతుందన్నారు. తమ సమస్యలపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

"తెలంగాణలో బీఆర్​ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ శాతం నష్టపోయింది గిరిజనులు. గిరిజనులకి సంబంధించినటువంటి భూమిపై ఉన్న హక్కులను, గతంలో ఇచ్చిన పట్టాలను తొలగించారు. కొత్తగా ఇవ్వాల్సిన పట్టాలు కూడా ఇవ్వలేదు. దీనివల్ల భూమిపై హక్కు లేకుండా, అడవిలో ఉన్న సంపదపై హక్కు లేకుండా మొదటిసారి గిరిజనులు విపరీతంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. వారి సమస్యలపై నేను ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నాయకుడిగా, ప్రతిపక్షనాయకుడిగా బహిరంగ లేఖ రాస్తున్నాను. ఆ లేఖను నేను విడుదల చేస్తున్నాను. చెన్నూరు నియోజకవర్గం భీమారం హెడ్​క్వార్టర్స్​లో ఈ లేఖను రిలీజ్ చేసి వారికి పంపిస్తున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ వారికి పంపిస్తున్నాము." _సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

గిరిజనుల పోడు భూముల పట్టాలకై ముఖ్యమంత్రికి భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.