మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. రోటిగూడలో మరో ఇద్దరికి వైరస్ సోకింది.
ఈనెల 12న మహారాష్ట్ర నుంచి జిల్లాలోని స్వగ్రామాలకు వచ్చిన వారిని అధికారులు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. అక్కడ వైరస్ లక్షణాలు కనిపించగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. నమూనాలు సేకరించి పరీక్షించగా.. ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీ చూడండి: భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్ సలాం!