నాలుగేళ్ల క్రితం సమీప అడవుల్లో నుంచి తన ఇంటికి వచ్చిన కోతులను చూసిన సందీప్ గుప్తా వాటికి ఆహారం అందించాడు.. రెండో రోజు అలానే వచ్చాయి.. అలానే మళ్లీ ఆహారం అందించాడు. మూడో రోజూ తన ఇంటికి వచ్చిన వానరాలను చూసిన సందీప్ గుప్తా మనసులో ఓ ఆలోచన వచ్చింది. వాటికి తోచినంత సాయం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ప్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాడు. సందీప్ సంకల్పానికి స్నేహితులు, బంధువులు అండగా నిలిచారు.
కోతులకు కనీసం వారానికి మూడు రోజుల చొప్పున ఆహరం అందించడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రమాదాల్లో గాయాల పాలవుతున్న జంతువులకు ట్రస్ట్ ద్వారా చికిత్స అందిస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకించి వాహనాన్ని కొనుగోలు చేసి స్నేహితులతో కలిసి అడువుల్లోని వానరాలకు ఆహారాన్ని అందిస్తున్నాడు.
ప్రతి రోజు సుమారుగా 80 కిలోల పండ్లు, ఆహార పదార్థాలు వానరాలకు అందిస్తున్నామని.. జంతు ప్రేమికులు ఎవరైన ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తే మరిన్ని కార్యక్రమాలు చేస్తానని సందీప్ గుప్తా తెలిపారు.
ఇవీ చూడండి:ఇకపై 17 నిమిషాల్లోనే మీ ఫోన్ బ్యాటరీ ఫుల్!