మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్పల్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో పాదముద్రలు గుర్తించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. పది రోజుల క్రితం గ్రామం మీదుగా జైపూర్ మండలానికి వెళ్లిన పులి తిరిగి మళ్లీ అడవిలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
దీనివల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పాదముద్రలు గుర్తించి అవి పులివేనని ధ్రువీకరించారు.