మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో 350 నాటు కోళ్లు మృతి చెందాయి. ఎంబడి బుచ్చయ్య అనే రైతు తన ఎకరం భూమిలో ఫామ్ ఏర్పాటు చేసి నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. అకస్మాత్తుగా 350 కోళ్లు మృత్యువాతపడ్డాయి.
మరో 50 కోళ్లు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. దీనితో లక్ష 50వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు బుచ్చయ్య ఆవేదన చెందాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. బర్డ్ ఫ్లూ అనుమానంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
- ఇదీ చూడండి: ప్రస్తుతానికి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: సీఎం