ETV Bharat / state

Study Circles: స్టడీ సర్కిళ్లు లేవు.. సరైన సదుపాయాల్లేవ్​.. - ts news

Study Circles: 4,429 ఉద్యోగాలు. 2లక్షల మంది నిరుద్యోగులు. కానీ, ఉన్నవి నాలుగే నాలుగు స్డడీ సర్కిళ్లు. భోజనం, వసతి కల్పించి శిక్షణ అందిస్తున్నది ఎస్సీ స్టడీసర్కిల్ ఒక్కటే. ఇదీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్టడీసర్కిళ్ల పరిస్థితి. ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రకటనతో పోటీపరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువత సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్థాయిలోనూ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.

Study Circles: స్టడీ సర్కిళ్లు లేవు.. సరైన సదుపాయాల్లేవ్​..

author img

By

Published : Mar 20, 2022, 6:51 PM IST

స్టడీ సర్కిళ్లు లేవు.. సరైన సదుపాయాల్లేవ్​..

Study Circles: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వేళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నిరుద్యోగులు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,429 ఖాళీలుండగా.. 2లక్షల మంది పోటీ పడనున్నారు. ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ అందించే స్టడీసర్కిళ్లు కేవలం నాలుగే ఉన్నాయి. మహబూబ్ నగర్‌లో 2, గద్వాల, వనపర్తిలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇందులో మహబూబ్ నగర్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మిగిలిన చోట్ల బోధనకు మాత్రమే పరిమితమైంది.

ప్రిపరేషన్​లో ముందున్నరు..

సెప్టెంబర్​ 17న ఈ బ్యాచ్​ ప్రారంభమైంది. దాదాపు 600 సెషన్లు ఉండే ఈ బ్యాచ్​లో ఇప్పటికే 300 సెషన్లు పూర్తి చేసుకున్నాం. అంటే విద్యార్థులు ప్రిపరేషన్​లో ముందున్నరు. ప్రముఖ ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహిస్తున్నాం. ప్రముఖులు రాసిన పుస్తకాలను అభ్యర్థులకు అందిస్తున్నాం. స్టడీ సర్కిల్​లో ఉండే అబ్బాయిలకు 100రూపాయలు, బాలికలకు 150 రూపాయల చొప్పున కాస్మొటిక్​ ఛార్జీలను కూడా అందిస్తున్నాం. ఆహారంతో పాటు మిగతావన్నీ చూసుకుంటున్నాం. కేవలం వాళ్లు ప్రిపేర్​ కావడమే.

-శ్రీనివాస్​, ఎస్సీ స్టడీ సర్కిల్​ డైరెక్టర్​

కొంత మందికి మాత్రమే..

రెండు లక్షల మంది నిరుద్యోగులుంటే కేవలం కొంతమందికి మాత్రమే ప్రస్తుతం ఉచిత శిక్షణ అందుతోంది. పాలమూరు జిల్లాలో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల నుంచి పోటీపడే యువతే అధికంగా ఉన్నారు. అందరికీ ఉచిత శిక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా మహిళలకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మహిళలను ప్రోత్సహించాలని కోరుతున్నారు.

స్టడీ మెటీరియల్​ను అందుబాటులోకి తీసుకురావాలి..

ప్రతి గ్రామంలోనూ 10నుంచి 15 మంది ఉద్యోగాల కోసం సిద్ధమవుతుంటారు. హైదరాబాద్‌కు వెళ్లి శిక్షణ పొందటం ఖర్చుతో కూడుకున్న పని కావటంతో గ్రామాల్లోనే స్టడీ మెటిరియల్ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కొద్దిరోజులైతే పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారు కనుక... ఉద్యోగ నిపుణులతో శిక్షణ అందిస్తే మేలు జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.

శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

వేల మందికి శిక్షణ అందించడం ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్ధి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చొరవచూపించాలని విస్తృతంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.