మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేశారు కలెక్టర్ వెంకట్ రావు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, సెక్షన్ 37 కింద గ్రామ సర్పంచ్‌కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు.
దేవరకద్ర మండలంలోని చాలా గ్రామాల్లో చెత్త వేరు చేసే షెడ్డులు ప్రారంభ స్థాయిలోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కమిటీలు వేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సంబంధించి ఇంకా స్థలాన్ని గుర్తించని గ్రామాల్లో వెంటనే ప్రక్రియ ప్రారంభించి వనాలు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట్ రావు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేయడం జరిగిందని, వాటన్నిటిని మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆగష్టు 10వ తేదిలోపు రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఇవీ చూడండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!