ETV Bharat / state

లాక్​డౌన్​తో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో తగ్గిన వ్యాక్సినేషన్​

author img

By

Published : May 12, 2021, 10:26 PM IST

కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియపై లాక్​డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. లాక్​డౌన్​తో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వ్యాక్సినేషన్​ సంఖ్య గణనీయంగా పడిపోయింది.

తగ్గిన వ్యాక్సినేషన్​
తగ్గిన వ్యాక్సినేషన్​

లాక్​డౌన్​తో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వ్యాక్సినేషన్​పై ప్రభావం పడుతోంది. ప్రారంభంలో ఒక్కోరోజు గరిష్ఠంగా 20 వేల నుంచి 30 వేల డోసుల వరకూ ఇచ్చారు. 45 ఏళ్లకు పైబడిన వాళ్లకు, కేవలం రెండో డోసు ఇచ్చే సందర్భంలోనూ నిన్నమొన్నటి వరకూ 5 వేల నుంచి 10 వేల డోసులు ఇచ్చారు. కానీ లాక్​డౌన్ సందర్భంగా ఈ సంఖ్య గణనీయంగా పడిపోయింది.

మహబూబ్​నగర్ జిల్లాలో ఇవాళ కేవలం 328 డోసులు, నాగర్ కర్నూల్ జిల్లాలో 150 డోసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 110 డోసులు, నారాయణపేట జిల్లాలో 72 డోసులు, వనపర్తి జిల్లాలో 49 డోసులు అందించారు. నిన్న మహబూబ్​నగర్ జిల్లాలో 1,500లకు పైగా డోసులు, నాగర్ కర్నూల్​లో 1,328 డోసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 558 డోసులు, వనపర్తి జిల్లాలో 892 డోసులు అందించారు.

నిన్నటితో పోల్చినా డోసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. లాక్​డౌన్ అమల్లో ఉన్నా వాక్సినేషన్ ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి నాలుగు గంటల వరకూ కొనసాగుతుందని వైద్యారోగ్యశాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. లాక్​డౌన్ కారణంగా జనం వ్యాక్సిన్​​ కేంద్రాలకు రాలేకపోయారు. వాక్సిన్ కోసం వెళ్లే వాళ్లు మొదటి డోసు వేయించుకున్నట్లుగా ఆధారాలు చూపితే పోలీసులు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ లాక్​డౌన్​తో రవాణాకు అవకాశం లేకపోవడంతో ఎక్కువ మంది వ్యాక్సిన్​ వేయించుకోలేకపోయారు.

ఇదీ చదవండి: ఆ 4 గంటలు ఎంతో కీలకం.. ఉరుకులు పరుగులతో రోజువారీ పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.