ETV Bharat / state

మహబూబ్​నగర్​ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు - కరోనా కేసుల తాజా వార్తలు

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. పాలమూరు జిల్లా హన్వాడ మండలానికి చెందిన ఓ వ్యక్తికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చాలా రోజులుగా కేసుల్లేవు. అందులో నాగర్ కర్నూల్ జిల్లాలో నెలన్నర వయసున్న బాబు వైరస్​ సోకి మరణించాడు.

మహబూబ్​నగర్​ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు

author img

By

Published : May 30, 2020, 9:37 PM IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కేసుల అలజడి మళ్లీ మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం పాలై ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. పరీక్షలు నిర్వహించగా శనివారం కరోనా ఉన్నట్లుగా నిర్ధరణ అయింది. భూత్పూరు మండలానికి చెందిన మరో వ్యక్తి అనారోగ్య సమస్యలతో హైదరాబాద్​లో చికిత్స పొందుతున్నాడు. పరీక్షలు నిర్వహించగా అతనికి కూడా కొవిడ్​ ఉన్నట్లుగా తేలింది. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చాలా రోజులుగా కేసుల్లేవు.

నెలన్నర బాబు కరోనాతో మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో నెలన్నర వయసున్న బాబు అనారోగ్యానికి గురికాగా.. నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా వైరస్​ ఉన్నట్లుగా తేలింది. గాంధీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో బాబు ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాబు రెండేళ్ల సోదరుడు సైతం జర్వం, దగ్గుతో బాధ పడుతున్నందున.. ఆ అబ్బాయి నమూనాలు సేకరించనున్నారు. బాబు తండ్రి రెండు వారాల కిందట హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసి వచ్చాడు. అతని ద్వారానే బాబుకు కరోనా సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఉస్మానియాలో పనిచేసే వ్యక్తికి కొవిడ్​-19

ప్రస్తుతం ఆ బాబు తల్లిదండ్రుల గ్రామాల్లో ప్రాథమిక కాంటాక్టులను గుర్తించడంతోపాటు.. వారిని క్వారంటైన్​లో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని చారగొండ, వంగూరు మండలాల్లో ఇటీవల రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉస్మానియాలో పనిచేసే ఓ యువకుడు శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో తల్లిదండ్రులను కలిసేందుకు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి వచ్చాడు. అరగంట సమయం గడిపి తిరిగి వెళ్లిపోయాడు. ఈ నెల 29న అతను నమూనాలు ఇవ్వగా.. శనివారం అతనికి కరోనా ఉన్నట్లుగా నిర్ధరణ అయింది.

సమాచారం అందుకున్న వనపర్తి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల కుటుంబాలను అధికారులు హోం క్వారంటైన్​లో ఉంచారు. ఈ పాజిటివ్ కేసు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనందున వనపర్తి జిల్లా ఇప్పటికే కరోనా రహిత జిల్లాగా కొనసాగుతోంది. నారాయణపేట జిల్లాలో శనివారం కరోనా కేసులు లేవు. ఇటీవలే మాగనూర్ మండలంలో ఒకటి, మక్తల్ మండలంలో ఒకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ కొత్తగా కేసులేం నమోదు కాలేదు.

ఇవీ చూడండి: జూన్​ 30 వరకు లాక్​డౌన్ 5.0-​ కీలక మార్గదర్శకాలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.