ETV Bharat / state

మినీ పోల్స్​: మూడు పురపాలికలపై ఎగిరిన గులాబీ జెండా - municipalities elections updates

పూర్వపు మహబూబ్​నగర్ జిల్లాలో ఎన్నికలు జరిగిన మూడు పురపాలికలపై గులాబీ జెండా ఎగిరింది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలపై తెరాస విజయకేతనం ఎగురవేసింది. జడ్చర్లలో 27 వార్డులకు 23, అచ్చంపేటలో 20 వార్డులకు 13, కొత్తూరులో 12 వార్డులకు 7 వార్డుల్ని గెలుచుకుని ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ జడ్చర్లలో-2, అచ్చంపేటలో-6, కొత్తూరులో-5 వార్డులను గెలుచుకుని రెండోస్థానానికి పరిమితమైంది. భాజపా 3మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటలేకపోయింది. జడ్చర్లలో-2, అచ్చంపేటలో ఒక్క స్థానానికే పరిమితమైంది. కొత్తూరులో కమలం వికసించలేదు.

trs win in 3 municipolities in mahaboobngar

author img

By

Published : May 3, 2021, 5:52 PM IST

పురపాలిక ఎన్నికలు జరిగిన 3 మున్సిపాలిటీల్లో తెరాస విజయకేతనం ఎగురవేసింది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో 27 వార్డులు ఉండగా... 23 స్థానాలు గెలుచుకుని ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. కాంగ్రెస్-2 భాజపా-2 వార్డులతో సరిపెట్టుకున్నాయి. గెలిచిన అన్నివార్డుల్లోనూ తెరాస స్పష్టమైన అధిక్యాన్ని కనబరిచింది. తొలి రౌండ్​లోనే 19 వార్డులకు సంబంధించిన ఫలితాలు ఒకేసారి వెలువడ్డాయి. అందులో అత్యధికం తెరాస గెలుచుకోవడం వల్ల ఛైర్మన్ పదవి గులాబీ పార్టీదేనని తేలిపోయింది. ఆ తర్వాత వెలువడిన ఫలితాల్లోనూ అధికంగా తెరాస గెలుచుకుంది. జడ్చర్ల మున్సిపాలిటీగా ఏర్పడిన పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధిని వివరిస్తూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మల్లురవి, భాజపా తరఫున మాజీ మంత్రి డీకే అరుణ బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించినా... ఫలితం లేకపోయింది. ప్రజలు తెరాస వైపే మొగ్గు చూపారు. జడ్చర్ల ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా... గెలిచిన అభ్యర్థుల్లో 8వ వార్డు తెరాస అభ్యర్థి లక్ష్మి పేరు పరిశీలనలో ఉంది.

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో సైతం కారు జోరు కొనసాగింది. మొత్తం 20 వార్డుల్లో తెరాస 13 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్-6 వార్డులు గెలుచుకోగా... భాజపా ఒక్క స్థానానికే పరిమితమైంది. తొలి రెండు రౌండ్లలో తెరాస- కాంగ్రెస్​లు సమాన స్థానాలు పొందగా... ఫలితాలు ఉత్కంఠ రేపాయి. ఆ తర్వాతి 2 రౌండ్లలో అధిక స్థానాలు తెరాస గెలుచుకోగా ఉత్కంఠకు తెరపడింది. 2016లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో తెరాస- మహకూటమి పోటీ పడగా.. 20 వార్డులకు 20 వార్డులు తెరాసనే గెలుచుకుంది. ఆ రికార్డును తిరగ రాయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. విస్తృత ప్రచారం నిర్వహించారు. కానీ... 13 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, భాజపా సైతం ఈ ఎన్నికల్ని సవాలుగా స్వీకరించాయి. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ... కాంగ్రెస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. భాజపా సైతం అన్నివార్డుల్లో అభ్యర్ధుల్ని పోటీకి నిలిపింది. విజయం మాత్రం తెరాసనే వరించింది. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ జరనల్​కు కేటాయించగా... ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. 16వ వార్డు నుంచి గెలిచిన నర్సింహ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజాతీర్పును గౌరవిస్తామని... అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని గువ్వల బాలరాజు తెలిపారు.

కొత్తూరు మున్సిపాలిటీలో 12 స్థానాలుండగా... 7 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. అధికార పార్టీకి కాంగ్రెస్ కొత్తూరులో గట్టి పోటీనిచ్చింది. 5 స్థానాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భాజపా బోణి చేయలేకపోయింది. మొదటి నుంచి ఫలితాలు పోటాపోటీగా వెలువడ్డాయి. చివరి రౌండ్ వరకూ.. పార్టీల ఆధిక్యంపై స్పష్టత రాలేదు. చివరగా తెరాస 2 స్థానాలు కాంగ్రెస్ కంటే అధికంగా గెలుచుకోవడం వల్ల అప్పటి వరకూ కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. 2, 3, 7, 8, 10, 11, 12 వార్డుల్లో తెరాస గులాబీ జెండా ఎగరగా... 1, 4, 5, 6, 9 వార్డుల్లో హస్తం విజయ దుందుభీ మోగించింది. తొలిసారిగా జరిగే ఎన్నికలు కావడంతో అన్నిపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కానీ.. కాంగ్రెస్- తెరాస మధ్య గట్టిపోటీ నెలకొంది. గెలుపొందిన తెరాస అభ్యర్థులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్... అభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా... మధ్యాహ్నం 2 గంటలలోపు దాదాపు అన్నివార్డుల ఫలితాలు వెలువడ్డాయి. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉండటం వల్ల గెలుపొందిన అభ్యర్థులు ధ్రువపత్రాలు పొంది బయటికి వెళ్లిపోయారు. ఎక్కడా... విజయోత్సవ ర్యాలీలు జరగలేదు. లెక్కింపు కేంద్రాల్లోనూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ఓట్లను లెక్కించారు. ప్రశాతంగా ప్రక్రియ ముగియడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి: జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.