జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఉద్యోగ నిబంధనల ప్రకారం వేతనాలు అందడం లేదని… టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సెక్రెటరీలకు అన్ని రకాల బెనిపిట్స్ అందజేస్తున్నట్టు ఉన్నా… క్షేత్రస్థాయిలో కేవలం రూ. 15 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని వాపోయారు. దీనికి తోడు 8 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉన్నా… రాత్రింబవళ్లు చేయించుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేస్తున్నా… ఆర్టికల్ 21 ప్రకారం సమాన పనికి... సమాన వేతనం అందడం లేదన్నారు. ఇప్పటికే 27 రకాల విధులు ఉండగా... ఉపాది హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లను తోలగించి… వారి పనితోపాటు మిషన్ భగీరథ పనులను సైతం అప్పజెప్పి అధిక భారం మోపారని ఆరోపించారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.