ETV Bharat / state

చావులోనూ వీడని బంధం.. భర్త మృతితో ఆగిన భార్య గుండె - husband

భర్త మరణాన్ని ఆ భార్య తట్టుకోలేకపోయింది. బోరున విలపించింది. ఏడ్చి ఏడ్చి భర్త శవంపై కుప్పకూలింది. వెంటనే బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

భర్త మృతితో ఆగిన భార్య గుండె
author img

By

Published : Sep 24, 2019, 11:56 PM IST

వివాహం జరిగినప్పటి నుంచి.. కలిసి జీవించారు. ఒకరి మరణం తట్టుకోలేక మరొకరు మృతి చెందారు. చివరకు ఒకేచోట చితిమంటల్లో ఇద్దరు కలిసిపోయిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీలోని సోది కుంట తండాలో చోటుచేసుకుంది. సోదికుంట తండాకు చెందిన ఖిర్య నాయక్ సోమవారం రాత్రి మృతిచెందాడు. భర్త మరణం తట్టుకోలేక కన్నీరు మున్నీరైన అతని భార్య దేవుళి అక్కడే కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్​కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఇంటికి తీసుకెళ్లడం ఉత్తమమని వైద్యులు చెప్పగా.. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి తీసుకువచ్చారు. కాసేపటికే భర్త మృతదేహం పక్కనే భార్య కూడా తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన తండవాసులందరినీ కలిచివేసింది. ఇద్దరికీ ఒకేసారి తండాలో శవయాత్ర నిర్వహించి.. వారి పొలంలో దహన సంస్కరాలు పూర్తి చేశారు.

భర్త మృతితో ఆగిన భార్య గుండె

ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం

Intro:నిండు 90 ఏళ్లు కలిసి జీవించి న వృద్ధ దంపతులు ఒకరి మరణం తట్టుకోలేక మరొకరు మృతి చెందారు చివరకు ఒకేచోట చితిమంటల్లో కలిసిపోయారు ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో బూరుగుపల్లి గ్రామ పంచాయతీలోని సోది కుంట తండా లో చోటుచేసుకుంది

Body:సోది కుంట తండా కు చెందిన ఖిర్య నాయక్(90) సోమవారం రాత్రి ఇ మృతిచెందాడు అతడి మరణం తట్టుకోలేక కన్నీరుమున్నీరైన అతని భార్య దేవుళి(85) అక్కడే కుప్పకూలింది వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉందని ఇంటికి తీసుకెళ్లడం ఉత్తమమని వైద్యులు చెప్పారు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తీసుకు వచ్చాను భర్త మృతదేహం సమీపంలోని భార్య కూడా తుది శ్వాస విడిచింది ఈ సంఘటన తండాలో అందరిని కలచివేసింది

Conclusion:యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు అనూహ్యంగా కలిసిమెలిసి ఉండే ఈ జంట చివరకు ఇద్దరు కలిసి ప్రాణాలు వదిలారని చర్చనీయాంశమైంది ఇద్దరికీ ఒకేసారి తండాలో శవయాత్ర నిర్వహించి వారి పొలంలో చితి మంటలు పెట్టారు దాన సంస్కారాలు పూర్తి చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.