Inter Board: ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంస్కృతంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన హరికిరణ్ అనే విద్యార్థికి సున్నా మార్కులు వచ్చినట్లు మెమోలో చూపిన ఇంటర్‌బోర్డు.. ఆ విద్యార్థికి ఒక మార్కు వచ్చిందని బుధవారం తెలిపింది.
ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పులు దొర్లాయంటూ మళ్లీ మళ్లీ అదే తప్పు.. ఇంటర్ బోర్డు తీరు మారదా శీర్షికన ఈటీవీ భారత్‌లో బుధవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఇంటర్‌బోర్డు ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని బుధవారం సబ్జెక్టు నిపుణుడితో పునఃపరిశీలన చేయించింది. అంతకు ముందు ఎగ్జామినర్ ఆ విద్యార్థి జవాబు పత్రానికి సున్నా వేశారని, తాజా ఎగ్జామినర్ మాత్రం ఒక మార్కు ఇచ్చారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవీ చదవండి: