ETV Bharat / state

సమస్యల సాధనకై ఎంపీటీసీలకు అధికారాలను బదిలీ చేయండి - మహబూబ్​నగర్​ జిల్లా తాజా వార్తలు

ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనా ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోకుండా ఉన్నామని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సభ్యులు కోరారు. ఈ మేరకు మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు.

tg state mptcs meeting at convention hall in mahabubnagar district
సమస్యల సాధనకై ఎంపీటీసీలకు అధికారాలను బదిలీ చేయండి
author img

By

Published : Oct 14, 2020, 6:01 PM IST

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీల చైతన్య సదస్సులో తీర్మానించారు.

గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రతినిధులుగా ఎన్నికైనా ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేకుండా ఉన్నామని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక సంస్థలైన జిల్లా, మండల పరిషత్​ల నుంచి తమకు అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే సంబంధిత మంత్రులకు వినతి పత్రం సమర్పించామని సభ్యులు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తమకు అధికారాలు బదిలీ అయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్​ని కలిసి విన్నవించుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: బస్తీలు జలదిగ్బంధం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కిషన్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.