శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వీరన్నపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి (పెద్దశివాలయం) ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో గుడికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ గుడికి గోపురం ఉండకపోవడం ఒక విశేషం కాగా.. గర్భ గుడిలోని శివలింగంపై నాగబంధం ఉండడం మరో విశేషం. మహాశివరాత్రి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు