ETV Bharat / state

యురేనియం తవ్వకాలపై ప్రభుత్వ వైఖరేంటి?

రాష్ట్రంలో ప్రస్తుతం అగ్గిరాజేస్తున్న అంశం నల్లమలలో యురేనియం తవ్వకం. గతకొద్ది రోజులుగా ఈ అంశంపై అక్కడి స్థానికులు, విపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సెలబ్రెటీస్​ కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తమ గళం వినిపిస్తున్నారు. వీటన్నింటిపై స్పందించిన మంత్రి కేటీఆర్​ ముఖ్యమంత్రితో ఈ విషయంపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు అందనప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న ఆందోళనల నేపథ్యంలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

యురేనియం తవ్వకంపై ప్రభుత్వ నిర్ణయం?
author img

By

Published : Sep 14, 2019, 11:05 AM IST

యురేనియం తవ్వకంపై ప్రభుత్వ నిర్ణయం?

నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై రోజురోజుకూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానికులు పోరాటాలు చేస్తుండగా రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను ముమ్మరం చేస్తున్నాయి. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. సామాజిక మాధ్యమల్లోనూ పెద్దఎత్తున 'సేవ్ నల్లమల' ఉద్యమం ప్రారంభమైంది. యురేనియం తవ్వకాలు జరిగితే నల్లమల పూర్తిగా ధ్వంసం అవుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని, కృష్ణా నదీజలాలు కలుషితమవుతాయని పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వంపై ఒత్తిడి...

యురేనియం తవ్వకాలకు సంబంధించి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సన్నాహాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆందోళనలు మరింతగా ఉద్ధృతమవుతున్నాయి. నమూనాల సేకరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్ర అణుశక్తి సంస్థ యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యత తెలుసుకునేందుకు సిద్ధమవుతోంది. నల్లమల విధ్వంసాన్ని ఆపాలని... యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వంపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.

బడ్జెట్​ సమావేశాల్లో ప్రస్తావన...

మరోవైపు ఈరోజు నుంచి కొనసాగే బడ్జెట్ సమావేశాల్లో ఏదో రూపంలో యురేనియం తవ్వకాల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యురేనియం తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించినట్లవుతుందనే భావిస్తున్నట్లు సమాచారం.

అణు ఇంధనం కంటే... సౌర విద్యుత్​ చౌక

పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే యురేనియం తవ్వకాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతికూల స్పందనే ఉంటుందని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అణుఇంధనం కంటే సౌర విద్యుత్ చాలా చౌకగా వస్తున్న నేపథ్యంలో పర్యావరణాన్ని విధ్వంసం చేసి యురేనియం తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసి ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : నల్లమల అడవుల్లో యురేనియం అలజడులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.