మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెదేపా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. దోపిడి వ్యవస్థను, కుటుంబ పాలనతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి సమాయత్తమవుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్ అన్నారు. ఎంత మంది నాయకులు బయటకు వెళ్లినా.. కార్యకర్తలు అండగా నిలబడ్డారని తెలిపారు. భవిష్యత్‌లో బలమైన శక్తిగా తెలుగుదేశం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెరాసలో ఓనర్షిప్ పంచాయితీ నడుస్తోందని.. రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: భాజపా ఎంపీ అర్వింద్‌ను కలిసిన తెరాస ఎమ్మెల్యే షకీల్