ప్రైవేటు పేరుతో ఆర్టీసీని నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు వామపక్షాల తరఫున సంఘీభావం తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థ నాశనమవుతుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తప్పును తెలుసుకుని ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. 18 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె విజయవంతంగా నడుస్తోందన్నారు. ఈ నెల 30న హైదరాబాద్లో నిర్వహించనున్న సకల జనుల సమర భేరి కోసం అన్ని జిల్లాలు పర్యటిస్తూ కార్మికులతో పాటు పార్టీ శ్రేణులను, ప్రజలను సమాయత్తం చేస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు లేనందున.. ఈ దీపావళికి ఒక్కో కార్మికుని కుటుంబాన్ని ఎవరైనా సాయమందించి ఆదుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: సమ్మెకు సహకరించాలంటూ ఆర్టీసీ కార్మికుల కంటతడి