తొలివిడత కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు కోరారు. మొదటి విడతలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు జిల్లా నుంచి 8,574 మంది ఫ్రంట్‌లైన్ సిబ్బందిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో గురించి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జనవరి 17న పల్స్ పోలియో కార్యక్రమం
జనవరిలో నిర్విహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లల వరకు అందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.