కరోనా నేపథ్యంలో రైతులు ఒకేచోట గుమిగూడకుండా చూడాలని, ఎరువులు అందరికీ అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల చెరువులు నిండి సాగు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఆయా మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు గ్రామాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి.. సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. దేశ కీర్తిని ప్రపంచానికి చాటింది: బండారు దత్తాత్రేయ