మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సమీపంలోని జయప్రకాశ్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గర లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన శ్రీనుగా గుర్తించారు.
శ్రీను ప్రభుత్వ ఉద్యోగి కాగా.. రాకపోకలు సాగిస్తుండే వాడు. గురువారం రాత్రి విధులు పూర్తి చేసుకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో దేవరకద్ర వైపు నుంచి జిల్లా కేంద్రానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మృతుడు శిరాస్త్రాణం(హెల్మెట్) ధరించినా.. లారీని బలంగా ఢీ కొట్టడం వల్ల ప్రాణాలు నిలువలేకపోయాయి. అందుకే అతివేగం అతి ప్రమాదకరమని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్