ప్రారంభానికి నోచుకోని రైతు బజారు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ పరిసరాల రైతులు కూరగాయలు తెచ్చి రోడ్లపై అమ్ముకుంటున్నారని వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిజూలై 30న శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూరగాయల మార్కెట్ యార్డ్‌ను ప్రారంభించారు. అయితే అధికారులు మాత్రం రైతులకు కేటాయించలేదు. వారి నిర్లక్ష్యంతో ఏడు నెలలు గడిచినా రైతు బజారు క్రయవిక్రయాలకు నోచుకోలేదు.
అధికారుల నిర్లక్ష్యం తమకు శాపం
ఈ విషయంలో ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని చెప్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి టెండర్లు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుంటామంటున్నారు వ్యాపారస్తులు. అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని వాపోతున్నారు కూరగాయల రైతులు, వ్యాపారులు.
ఇవీ చూడండి:తెరాసకు ఓటేస్తే మోరీలో వేసినట్టే: ఉత్తమ్