ETV Bharat / state

వ్యవసాయ పొలంలో కొండచిలువ

ఓ రైతు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా... ఓ కొండ చిలువ తారసపడింది. విషయం తెలుసుకున్న "జీవ వైవిధ్య పరిరక్షణ అభివృద్ధి సమాఖ్య" సభ్యులు గ్రామస్థుల సహకారంతో కొండచిలువను పట్టుకున్నారు.

వ్యవసాయ పొలంలో కొండచిలువ
author img

By

Published : Sep 24, 2019, 7:29 PM IST

దట్టమైన అడవుల్లో ఉండాల్సిన కొండచిలువ వ్యవసాయ పొలంలో కనిపించేసరికి రైతులు, కూలీలు భయాందోళనకు గురయిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా లింగాయిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుక్కలి బుచ్చయ్య వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. ఓ కొండ చిలువ తారసపడింది. వెంటనే స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న "జీవ వైవిధ్య పరిరక్షణ అభివృద్ధి సమాఖ్య" సభ్యులు గ్రామస్థుల సహకారంతో కొండచిలువను పట్టుకున్నారు. పది అడుగులు ఉన్న కొండచిలువ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల నుంచి పంటపొలాలకు వచ్చి చేరిందని.. దీని వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొండచిలువను నల్లమల అడవిలో వదిలివేయనున్నట్టు తెలిపారు.

వ్యవసాయ పొలంలో కొండచిలువ

ఇవీ చూడండి : "తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావాలి"

Intro:TG_Mbnr_10_24_Python_In_Agri_Fields_avb_TS10052
కంట్రిబ్యూటర్ చంద్రశేఖర్- మహబూబ్ నగర్
(9390592166)
( ) దట్టమైన అడవుల్లో ఉండాల్సిన కొండచిలువ వ్యవసాయ పొలంలో కనిపించేసరికి రైతులు, కూలీలు భయాందోళనకు గురయ్యారు. Body:మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం లింగాయిపల్లి గ్రామంకు చెందిన రైతు బుక్కలి బుచ్చయ్య వ్యవసాయ పొలంలో జొన్న పంటలో పనులు చేసుకుంటుండగ కొండ చిలువ తారసపడింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది కి సమాచారం అందించారు.Conclusion:కొండ చిలువ ఉన్న విషయం తెలుసుకున్న పాములను పరిరక్షించే "జీవ వైవిధ్య పరిరక్షణ అభివృద్ధి సమాక్య" గ్రామస్తుల సహకారంతో ఎలాంటి హానీ జరుగకుండా కొండ చిలువను పట్టుకున్నారు. పది అడుగులు ఉన్న కొండచిలువ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల నుంచి పంటపొలాలకు వచ్చి చేరిందని... దీని వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగలేదని సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీన్ని జాగ్రత్తగా బందించి నల్లమల అడవులలో వడిలివేయననట్టు వివరించారు..... Spot
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.