ETV Bharat / offbeat

గుమ్మడికాయతో అద్దిరిపోయే పరోటా గురూ! - ఒక్కసారి తింటే పక్కా మళ్లీ కావాలంటారు! - PUMPKIN PARATHA RECIPE

- కేవలం 10 నిమిషాల్లోనే కమ్మటి పరోటా సిద్ధం

Pumpkin Paratha Recipe
Pumpkin Paratha Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 10:20 AM IST

Pumpkin Paratha Recipe in Telugu : మనలో చాలామందికి పరోటా అనగానే ఆలు పరోటానే గుర్తుకు వస్తోంది. వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా పరోటాలు తింటే ఆ ఫీలింగ్​ అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలా మంది తరచూ పరోటాలు చేసుకుని తింటుంటారు. అయితే.. పరోటాలను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా గుమ్మడికాయ గుజ్జుతో తయారు చేద్దాం!

ఈ గుమ్మడికాయ పరోటాలను బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​ ఇలా ఏ పూటకైనా చేసుకుని తినచ్చు. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా సింపుల్​గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా! మరి, ఈ గుమ్మడికాయ పరోటాలు ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • గుమ్మడికాయ ముక్కలు- అరకేజీ (పైన చెక్కు తీసేసుకోవాలి)
  • గోధుమ పిండి- 4 కప్పులు
  • ఉప్పు -టీస్పూన్​
  • పంచదార - 2 టీస్పూన్లు
  • నూనె- సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై పాన్​ పెట్టి నీళ్లు పోయండి. ఆపై కట్​ చేసిన గుమ్మడికాయ ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోండి.
  • తర్వాత వాటిని నీటిలో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు గరిటె లేదా చేతితో పూర్తిగా మెదుపుకోండి.
  • అలాగే ఇప్పుడు ఒక మిక్సింగ్​ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, చక్కెర వేసుకుని కలపండి. తర్వాత మెదుపుకున్న గుమ్మడికాయ గుజ్జు ఒక పెద్ద కప్పు వేసుకోండి.
  • పిండిని బాగా మిక్స్​ చేయండి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.
  • చివరిగా పిండిలో కొద్దిగా ఆయిల్​పోసి మూత పెట్టి 15 నిమిషాలు అలా వదిలేయాలి.
  • ఆపై పిండిపై కొద్దిగా పొడి పిండి వేసి.. మరోసారి బాగా కలపాలి.
  • ఇప్పుడు చపాతీ పిండిని చిన్న ముద్దలుగా చేసుకోండి.
  • తర్వాత చిన్న ముద్దను తీసుకుని పొడి పిండిలో ముంచి చపాతీ పీటపై ఉంచాలి.
  • ఇప్పుడు చపాతీ కర్రతో పరోటా మాదిరిగా రోల్​ చేసుకోండి.
  • ఇలా అన్ని పరోటాలను సిద్ధం చేసుకున్న తర్వాత.. స్టౌపై చపాతీ పెనం పెట్టండి.
  • ఆ తర్వాత పెనంపై కొద్దిగా ఆయిల్​ వేసి స్ప్రెడ్​ చేయండి. ఇప్పుడు పరోటాను వేసి మీడియం ఫ్లేమ్​లో దోరగా కాల్చాలి.
  • తర్వాత పరోటాని మరోవైపు తిప్పి కాస్త ఆయిల్​ వేసి కాల్చుకోవాలి.
  • పరోటాలను మీడియం ఫ్లేమ్​ మీద కాల్చుకుంటే చక్కగా ఉడుకుతాయి.
  • ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ గుమ్మడికాయ పరోటా మీ ముందుంటుంది.
  • ఈ పరోటాలు ఏ కర్రీలోకైనా రుచి అద్భుతంగా ఉంటాయి.
  • నచ్చితే ఈ విధంగా పరోటాలను ఇంట్లో ఓ సారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

చలికాలం ఇడ్లీ/దోశ పిండి చక్కగా పులియాలంటే - పప్పు నానబెట్టేటప్పుడు వీటిని ఒక స్పూన్ కలిపితే చాలట!

సూపర్ టేస్టీ "సగ్గుబియ్యం దోశలు" - నిమిషాల్లో చేసుకోండిలా! - అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.