మాలిక వసతుల కల్పనలో భాగంగా మున్సిపాలిటీల్లో సామూహిక మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని 3 నెలల క్రితం... మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కార్యచరణ రూపొందించి పనులు చేపట్టాలని.... ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. నిర్మించిన వాటిలో మహిళలు, పురుషులకు సమానంగా కేటాయించాలని నిర్ణయించారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభినప్పటికీ....నిర్మాణాలు చాలా చోట్ల అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి..
మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, భూత్పూరు, జడ్చర్ల మున్సిపాలిటీలున్నాయి. ఇందులో మహబూబ్ నగర్ కేంద్రం జనాభా 2 లక్షల 50 వేలు కాగా... బయటి ప్రాంతాల నుంచి నిత్యం 50 వేలకు పైగా జనాభా వస్తుంటారు. ఈ ప్రాతిపదికన ఇప్పుడు ఉన్న వాటికి అదనంగా.... మరో150 నిర్మించాలని ప్రతిపాదించారు. పిల్లలమర్రి రోడ్డు, జనరల్ ఆసుపత్రి, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టగా....మరికొన్నిచోట్ల పనులు ప్రారంభం కాలేదు. జడ్చర్ల మున్సిపాలిటీనూ పనులు అసంపూర్తి ఉండగా..... భూత్పూర్ మండలంలో నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో.. 5 చోట్ల మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాలని ప్రతిపాదించారు. బాయ్స్ హైస్కూల్, గాంధీ పార్కు వద్ద...స్థలవివాదాల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. కొన్ని పనులు పురోగతిలో ఉన్నప్పటికీ.... కొల్లపూర్, కల్వకుర్తిలో పనులు ఆశించిన స్థాయిలో లేవు. గతంలో కల్వకుర్తి మున్సిపాలిటిలో జరిగిన సభలోనే మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మిస్తేనే... నిధులిస్తామని కేటీఆర్ అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో.... మొత్తం కలిపి 99 మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలి. గద్వాలలో 46 మరుగుదొడ్లకు గాను.. జిల్లా ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన 15....అందుబాటులోకి రానుండగా... మిగిలినవి అసంపూర్తిగానే ఉన్నాయి. అయిజలో ఇప్పటికే 12 ఉండగా... మరికొన్నిపూర్తికావాల్సి ఉంది. అలంపూర్, వడ్డేపల్లిలో పనులు పురోగతిలో ఉన్నాయి.
వనపర్తి, నారాయణపేట జిల్లాలోనూ... మరుగుదొడ్లు నిర్మించలేకపోయారు. వనపర్తిలో 5 చోట్ల నూతనంగా మరుగుదొడ్లు నిర్మించాలని ప్రతిపాదిస్తే..నాలుగు చోట్ల పనులు సాగుతున్నాయి. ఒక చోట పనులు మెుదలు కాలేదు. కొత్తకోటలో ప్రతిపాదించిన 8 చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. నారాయణపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కాంప్లెక్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ....మరో నాలుగు నిర్మించాల్సి ఉంది. మక్తల్ మున్సిపాలిటీలో కొత్తగా 30 ప్రతిపాదిస్తే 16 పూర్తయ్యాయి.
అవసరానికి తగినట్లుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులో లేని కారణంగా బహిరంగ మలమూత్ర విసర్జన పెరుగుతోంది. పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడక తప్పట్లేదు.